ముంబై: దేశీయ నెంబరు వన్ టెలికాం సంస్థ రిలయన్స్‌జియో తన వినియోగదారులకు మరోసారి బంపర్ ఆఫర్ ప్రకటించింది. '2020 హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్'ను సోమవారం ప్రకటించింది. రూ. 2020ల ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 1.5 జీబీ డేటాతో అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, ఎస్‌ఎంఎస్‌లు అందిస్తోంది. దీంతో పాటు మరో ఆఫర్ కూడా ఉంది. 2020 ఆఫర్ ప్లాన్ కొనుగోలు చేసిన చందారులకు జియో ఫోన్ ఉచితం అంతేకాదు. 12 నెలల సర్వీసులు కూడా ఉచితం. ఈ జియో ఫోన్‌లో రోజుకు 0.5 జీబీ డేటాను అన్‌లిమిటెడ్‌కాల్స్, ఎస్‌ఎంఎస్ సదుపాయాలను అందివ్వనుంది. రేపటి (డిసెంబరు 24) నుంచి ఈ ప్లాన్ కస‍్టమర్లకు అందుబాటులో ఉంటుందనీ ఈ ప్లాన్‌వాలిడిటీ సంవత్సర కాలం అని జియో ఒక ప్రకటనలో తెలిపింది.